Nidhi Agarwal:సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నిధి అగర్వాల్..! 10 h ago
టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ పోలీసులని సంప్రదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి తనను ట్యాగ్ చేస్తూ వేధిస్తున్నారన్నారు. కాగా తనతో పాటు తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ బెదిరింపుల వల్ల తాను మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపింది. నిధి అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.